Videos

ఎంగేజ్ మెంట్ కి ఫాన్స్ ని వద్దంటున్న మెగా ఫ్యామిలీ


                   మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్న రామ్ చరణ్-ఉపాసన నిశ్చితార్దం రేపు డిసెంబర్ 1 న గండిపేట్ లోని ఉపాసన ఫ్యామిలీ కి  చెందిన ఫామ్ హౌస్ లో  జరగబోతుంది అయితే భద్రత కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి ఫాన్స్ ఎవరు రావద్దని నాగబాబు కోరినట్టు తెలుస్తుంది.
          ఇప్పటికే చిరు దంపతులు గవర్నర్ ని స్వయంగా కలిసి  నిశ్చితార్దానికి రావాలని ఆహ్వానించారు, అలాగే చిరు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది, నిశ్చితార్దానికి అమితాబ్ కూడా వస్తున్నాడని అంటున్నారు . VVIP లు వస్తుండటంతో భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ తెలిపాడు. అభిమానులు నిరాశ చెందవద్దని పెళ్లి తర్వాత ఫాన్స్ కి పార్టీ ఇస్తామని చిరు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిదులందరికి బార్ కోడ్ ఉన్న చిన్న atm size కార్డు ఇచ్చారు అందువల్ల బయటి వాళ్ళు వచ్చే అవకాశం లేదు.
Share on Google Plus

About siddu

0 comments:

Post a Comment