Videos

అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం


                   ఈ రోజు ఓయూ జాక్ పిలుపు మేరకు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చాలా ఉద్రిక్తంగా మారింది. ఉదయం నుంచే విద్యార్దులు పెద్ద ఎత్తున ర్యాలిలు చెప్పట్టారు, ఒక్కసారిగా వందలమంది విద్యార్దులు ఓయూ గేటు దెగ్గరికి వచ్చారు అయితే అప్పటికే పోలీసులు తమకున్న  సమాచారం  మేర ఓయూ నుంచి వచ్చే దారులన్నింటి వద్ద భారీ బలగాలని మొహరించారు. స్థానిక పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ మరియు పార మిలిటరీ బలగాలు వందల సంఖ్యలో వస్తున్న విద్యార్దులను అడ్డుకున్నారు, ఈ దశలో విద్యార్దులకు పోలీసులకు మద్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి చేయి జారుతుండడంతో పోలీసులు భాష్పా వాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో దాదాపు పది మంది విద్యార్దులకు గాయాలు అయ్యయీ.
                               ఓయూ లో పరిస్థితి కొంచం సద్దుమనిగిందని అనుకుంటున్న సమయంలో తెలంగాణా లాయర్లు రాజ్ భవన్ ను ముట్టడించటానికి ప్రయత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాయర్లు సోమాజిగూడ లోకల్ రైల్వే స్టేషన్ ని ద్వంసం చేసారు, రైలుకి నిప్పు పెట్టారు దీంతో అలెర్ట్ అయిన పోలీసులు అక్కడికి చేరుకిని లాయర్లను అరెస్టు చేసారు, ఇదే సమయంలో నిజాం కాలేజి వద్ద విద్యార్దులు ఒక్కసారిగా రెచ్చిపోయారు, పోలీసులపైకి రాళ్ళూ  రువ్వారు అయితే పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు.ఏదేమైనా ఈ రోజంతా హైదరాబాద్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
                       ఇదిలా ఉంటె రేపటి నుంచి రెండు రోజుల పాటు  తెలంగాణా బంద్ కి టి-జాక్ పిలుపునిచ్చిన  నేపద్యంలో అన్ని రాజకీయ పార్టీలు బంద్ కి తమ మద్దతు ప్రకటించాయి. మరి రేపు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Share on Google Plus

About siddu

0 comments:

Post a Comment