సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగ రాజు ఈ రోజు బెయిలు ఫై చంచలగూడజైలు నుంచి విడుదల అయ్యాడు. 2009 జనవరిలో సత్యం కుంభకోణం కేసు లో రాజు అరెస్టు అయిన విషయం తెలిసిందే కాగా అప్పటి నుంచి బెయిలు కోసం రాజు తరపు న్యాయవాదులు ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2010 అక్టోబర్ లో హైకోర్ట్ సత్యం రాజు కి బెయిలు ఇచ్చింది అయితే సిబిఐ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది దీంతో సుప్రీం మళ్లీ బెయిల్ని రద్దు చేసింది. ఎట్టకేలకు నవంబర్ 4 2011 న సుప్రీం షరతులతో కూడిన బెయిలు కి ఓకే చెప్పడంతో నవంబర్ 5 న చంచలగూడ జైలు నుంచి విడుదల అయ్యాడు
రామలింగ రాజుతో పాటు మరో ఇద్దరు ముఖ్యమైన నిందితులు బెయిలు మీద రిలీజ్ అయ్యారు. జైలు నుంచి విడుదల అయిన వెంటనే రాజు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నాడు అయితే జైలు వద్ద భారీగా చేరుకున్న మీడియా తో మాట్లాడటానికి రాజు నిరాకరించాడు.
0 comments:
Post a Comment